DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణం శ్రీ మహాయోగి లక్ష్మమ్మ నగర్‌కు చెందిన బోయ నాగలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ముగ్గురు సంతానం కలిగిన ఈ కుటుంబం అత్యంత పేద పరిస్థితుల్లో జీవిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు ఆది గుడిసె కృష్ణమ్మల సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) స్కీమ్ ద్వారా హాస్పిటల్ బిల్లుకు సంబంధించి మొత్తం రూ.68,000కు గాను రూ.33,795 మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయం అందినందుకు మృతురాలి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ, సహకరించిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మారుతి (టిడిపి మాజీ కౌన్సిలర్, ఇందిరానగర్), టిడిపి సీనియర్ నాయకులు బోయ రాజశేఖర్, దేవేంద్ర నరసింహ యాదవ్, వడ్డే నాగరాజు, బోయ రంగన్న, రవి తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News