Monday, 15 June 2026 01:43:28 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

మంత్రి అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలి... : వైయస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ పేరాడ తిలక్ డిమాండ్‌

Date : 05 March 2026 10:06 AM Views : 79

DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మండలి చైర్మన్‌కి మతం, పార్టీ ఆపాదిస్తూ మాట్లాడిన సీనియర్‌ మంత్రి అచ్చెన్నాయుడు తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని, సభలో అడుగుపెట్టకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనపై చర్యలు తీసుకోవాలని వైయస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ పేరాడ తిలక్ డిమాండ్‌ చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఇన్నాళ్లు దేవుడిని రాజకీయాల్లోకి లాగి ఆలయ ప్రతిష్టను మసకబార్చిన కూటమి నాయకులు.. మాట్లాడాల్సిన సబ్జెక్టుని పక్కన బెట్టి శాసనమండలి చైర్మన్‌ని చర్చలోకి లాక్కురావడమే కాకుండా ఆయన్ను కులమతాల పేరుతో కించపరచడం దారుణమని ఆయన ఆక్షేపించారు. రాజ్యాంగ వ్యవస్థలో నిన్నను చీకటిరోజుగా చూడాలని పార్టీ టెక్కలి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పేరాడ తిలక్ స్పష్టం చేశారు. ప్రెస్‌మీట్‌లో పేరాడ తిలక్ ఇంకా ఏం మాట్లాడారంటే..: మండలి ఛైర్మన్‌ను అవమానించడం దారుణం: కల్తీ నెయ్యి పేరుతో టీటీడీ నిధుల దోపిడీకి పాల్పడిన హెరిటేజ్‌ అంశం మండలిలో చర్చకు రావడంతో దానికి సమాధానం చెప్పలేక సభలో లేని వైయస్‌ జగన్‌ గారు, మండలి చైర్మన్లు క్రిస్టియన్లు అని మాట్లాడుతూ సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం అత్యంత హేయమైన చర్య. పైగా మీ నాయకుడు జగన్‌ అంటూ మండలి చైర్మన్‌కు పార్టీని ఆపాదించి అవమానించారు. ఇది దారుణం. ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌ చేసిన టీటీడీ నిధుల దోపిడీపై వైయస్సార్సీపీ సభ్యులు ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పుకోలేని ప్రభుత్వం సభను పక్కదోవ పట్టించడానికి చైర్మన్‌ని రాజకీయాల్లోకి లాగి మతాన్ని, పార్టీని ఆపాదించింది. అధికార పక్ష సభ్యుల అనైతిక ప్రవర్తన: అధికార పార్టీ సభ్యులం అన్న విషయమే మరిచిపోయి వైయస్సార్సీపీ సభ్యులు మాట్లాడుతుండగా ప్రసంగానికి పదులసార్లు అడ్డుతగలడమే కాకుండా మంత్రులంతా పోడియం చుట్టుముట్టి సభలో ఆందోళన చేయడం సిగ్గుచేటు. నేను ఫలానా మతం అని మండలి చైర్మన్‌ చెప్పుకునే దుస్థితి కల్పించినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి. పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోతే ఎవరికైనా కులమతాలు అంటగట్టి దిగజారుడు రాజకీయాలు చేస్తామని కూటమి నాయకులు చెప్పకనే చెబుతున్నారు. అచ్చెన్నాయుడిపై చర్య తీసుకోవాలి: ఇప్పటికైనా సీఎం చంద్రబాబు కలగజేసుకుని మంత్రి కె.అచ్చెన్నాయుడిని రాబోయే మూడేళ్లపాటు సభలో అడుగుపెట్టకుండా శాశ్వతంగా సభ నుంచి సస్పెండ్‌ చేయాలి. మంత్రి అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటిస్తే సరిపోదు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలి. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్‌ చేయాలి. శ్రీవారిని రాజకీయాల్లోకి లాగినందుకు కూటమిని ప్రజలు అసహ్యించుకుంటుంటే దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కులమతాలతో రాజకీయాలు చేయడం అత్యంత హేయమైన చర్య అని పేరాడ తిలక్ అభివర్ణించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :