DNB News - ఆంధ్రప్రదేశ్ / : స్థానిక పురపాలక కమిషనర్‌గా సిఎండి నయూం అహ్మద్ సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న కమిషనర్ కృష్ణ కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆకస్మికంగా బదిలీ కావడంతో, ముందస్తు ప్రణాళికలో భాగంగా గుంతకల్లు పురపాలక సంఘ కమిషనర్‌గా పనిచేస్తున్న నయూం అహ్మద్‌ను ఈ స్థానానికి నియమిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అసిస్టెంట్ కమిషనర్ నాసిర్ హుస్సేన్, మున్సిపల్ ఇంజనీర్ సత్యనారాయణ, డిఈలు రాజశేఖర్ రెడ్డి, రామ్మూర్తి తదితర అధికారులు, సిబ్బంది కమిషనర్ నయూం అహ్మద్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పరిచయం చేసుకున్నారు.
Admin
DNB News