Wednesday, 17 June 2026 02:08:59 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు పెంచాలి: సిపిఎం..

Date : 05 February 2026 03:06 PM Views : 74

DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న స్త్రీ శక్తి పథకం కారణంగా ఆర్టీసీ బస్సుల అక్యుపెన్సీ రేషియో 67 శాతం నుంచి 98 శాతానికి పెరిగిందని, ఈ పెరిగిన ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా ఆర్టీసీ బస్సుల సంఖ్యను తక్షణమే పెంచాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదోని ఆర్టీసీ డిపో మేనేజర్ రఫీక్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ మండల కార్యదర్శులు లక్ష్మన్న, లింగన్న, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, తిప్పన్న, నాయకులు వెంకటేష్, భీమ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగినా బస్సుల సంఖ్య పెరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని, సకాలంలో స్కూళ్లు, కాలేజీలకు విద్యార్థులు చేరుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు అక్యుపెన్సీ పెరిగి ఉండగా, మరోవైపు బస్సులు పాతవిగా మారడంతో తరచూ మధ్యలో నిలిచిపోతున్నాయని గుర్తు చేశారు. పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు తగిన విధంగా బస్సులు లేకపోవడమే ఈ సమస్యలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఇటీవల ప్రైవేట్ బస్సుల్లో మూడు ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగించే విషయమని, రవాణా శాఖ సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని వారు విమర్శించారు. రాష్ట్రంలో ఆర్టీసీకి 11 వేల మంది సిబ్బంది అవసరమని అధికారులు కోరుతున్నప్పటికీ, ఇప్పటివరకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీకి అవసరమైన సిబ్బందిని నియమించాలని, ప్రజల అవసరాల డిమాండ్‌కు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: