DNB News - ఆంధ్రప్రదేశ్ / : దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత మోటరైజ్డ్ ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించి లబ్ధిదారులకు ట్రై సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి మాట్లాడుతూ దివ్యాంగులు ఆర్థికంగా, సామాజికంగా స్వయం సమృద్ధిగా ఎదగాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వారికి స్వతంత్ర జీవనాన్ని కల్పించేందుకు మోటరైజ్డ్ ట్రై సైకిళ్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. లక్ష రూపాయల విలువైన మోటరైజ్డ్ ట్రై సైకిళ్లను ప్రభుత్వం ఉచితంగా అందించడం ద్వారా అనేక మంది దివ్యాంగులకు ఉపయుక్తం అవుతుందని పేర్కొన్నారు. త్వరలోనే మరిన్ని మోటరైజ్డ్ ట్రై సైకిళ్లను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తెప్పించి అర్హులైన ప్రతి దివ్యాంగుడికి అందజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
Admin
DNB News