DNB News - ఆంధ్రప్రదేశ్ / : గ్యాస్ వినియోగదారుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అదనపు డబ్బులు వసూలు చేయకూడదని, వినియోగదారులకు నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి భారత్ గ్యాస్ మాధురి ఏజెన్సీ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం పెద్దకడుబూరు మండల కేంద్రంలోని భారత్ గ్యాస్ మాధురి ఏజెన్సీ పనితీరును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే గ్యాస్ సిలిండర్లు అందించాలని, హోమ్ డెలివరీ పేరుతో గానీ, ఇతర కారణాలతో గానీ వినియోగదారుల నుంచి అదనపు డబ్బులు అడిగినట్లు ఫిర్యాదులు ఎక్కడ రాకూడదని కలెక్టర్ భారత్ గ్యాస్ మాధురి ఏజెన్సీ వారిని హెచ్చరించారు. వినియోగదారుల సంతృప్తే లక్ష్యంగా పని చేయాలని, ప్రజల నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చేలా సేవలు మెరుగుపరచాలన్నారు. అదనపు వసూళ్లపై ఫిర్యాదులు అందితే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కార్యక్రమంలో ఆదోని ఇంచార్జి సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, డిఎస్ఓ రాజా రఘువీర్, తహసిల్దార్ గీతా ప్రియదర్శిని, ఎంపీడీవో ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News