Wednesday, 17 June 2026 03:03:43 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

జిల్లాలో మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై కట్టుదిట్టమైన చర్యలు – జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

Date : 02 March 2026 12:02 PM Views : 62

DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లాలో మత్తు పదార్థాల రవాణా మరియు వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నార్కోటిక్స్ కోఆర్డినేషన్ (NCORD) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలలో మత్తు పదార్థాల వినియోగంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. విద్యాసంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయాలపై గట్టి నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పంట పొలాల్లో గంజాయి సాగుపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలని, వ్యవసాయ మరియు రెవెన్యూ శాఖల అధికారులు పోలీస్ శాఖకు తక్షణ సమాచారం అందించాలని తెలిపారు. ఆర్టీసీ బస్సుల ద్వారా మత్తు పదార్థాల రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఆర్‌ఎంను ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా మాట్లాడుతూ జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాలో రెండు కేసులు నమోదు చేసి, 1.350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని చెప్పారు. క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీనివాసులు, సెట్కూర్ సీఈవో వేణుగోపాల్, డీఈఓ సుధాకర్, ఆర్‌ఐవో లాలెప్ప, ఈగల్ ఎస్సై సుజన్ కుమార్, డీఎంహెచ్ డా. భాస్కర్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాధిక, బీసీ వెల్ఫేర్ అధికారి ప్రసూన తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: