Wednesday, 17 June 2026 02:30:12 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

చైన్ స్నాచింగ్ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్, పల్సర్ బైక్ స్వాధీనం..

Date : 22 April 2026 11:42 AM Views : 36

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గుత్తి పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ నెల 9వ తేదీ రాత్రి గుత్తి పట్టణంలోని పెట్రోల్ బంక్ సమీప సాయినాథ్ నగర్‌లో ఓ వివాహిత మెడలో నుంచి ఇద్దరు దుండగులు బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. అదే రోజు సంతోష్ నగర్‌లో ఓ వృద్ధురాలిని కత్తితో బెదిరించి ఆమె మెడలోని గొలుసును దోచుకుని పారిపోతుండగా, స్థానికులు స్పందించడంతో నిందితులు మోటార్ సైకిల్‌ను అక్కడే వదిలి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలాలను పరిశీలించి, మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్ సహా పలు ఆధారాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టెక్నికల్ ఆధారాల సహాయంతో నిందితులు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భవారియా గ్యాంగ్ సభ్యులు మానవ్, హరి ప్రకాష్‌లుగా గుర్తించారు. వారిలో మానవ్‌ను బాలాజీ నగర్‌లో అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి దొంగిలించిన బంగారు గొలుసు ముక్కను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితులు ముందుగా బెంగుళూరు నుంచి అనంతపురం చేరుకుని, అక్కడ పల్సర్ మోటార్ సైకిల్‌ను దొంగిలించి కర్నూలులో చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. పరారీలో ఉన్న మరో నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ కేసు ఛేదనలో సీఐ విక్రమ్ సింహ, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ గోపి, పీసీలు మురళి, సుబ్బారాయుడు తదితరులు కీలక పాత్ర పోషించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :