DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ - పీజీఆర్‌ఎస్) కార్యక్రమం సోమవారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి , జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ పాల్గొని ప్రజల నుండి నేరుగా వినతులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ కి వివరించారు. ముఖ్యంగా భూ వివాదాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, గృహ నిర్మాణం, తాగునీరు, విద్య మరియు ఆరోగ్య సంబంధిత సమస్యలపై వినతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. ఏ. సిరి గారు సంబంధిత శాఖల అధికారులను సమస్యలను తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పారదర్శకంగా పరిష్కరించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఈ వేదిక ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
Admin
DNB News