DNB News - ఆంధ్రప్రదేశ్ / : మంత్రాలయం నియోజకవర్గంలో పేదల సంక్షేమం కోసం సీఎం సహాయ నిధి చెక్కులను మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ ఎన్. రాఘవేంద్ర రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు. ఈరోజు మాధవరం టిడిపి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు మొత్తం రూ. 28,76,658 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. పేదలు అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిన సమయంలో తమ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకుండా, కష్టకాలంలో వారికి అండగా నిలిచే మహత్తరమైన పథకం సీఎం సహాయ నిధి అని ఆయన పేర్కొన్నారు. లోటు బడ్జెట్ పరిస్థితుల్లో కూడా పేదల సంక్షేమాన్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకుని కూటమి ప్రభుత్వం రాజీ లేకుండా పనిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని, భవిష్యత్తులో ఆయనకు ప్రజలు మద్దతు ఇవ్వాలని ప్రజాప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముత్తురెడ్డి, మండల అధ్యక్షులు పల్లెపాడు రామిరెడ్డి, సురేష్ నాయుడు, టిబిపి చైర్మన్ టిప్పు సుల్తాన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్సారెడ్డి, మాలపల్లి లక్ష్మయ్య, వెంకటేష్, సొట్టయ్య, బసప్ప నాయుడు, వీరేష్, సురేష్, పూజారి, గొట్టయ్య తదితర కూటమి పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
DNB News