Saturday, 18 April 2026 02:04:22 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

నారా లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా కోసిగిలో మెగా రక్తదాన శిబిరం..

Date : 21 January 2026 04:51 PM Views : 74

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఈ నెల 23వ తేదీన యువ నాయకులు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు కోసిగి పట్టణంలోని శ్రీ యల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. యువకుల ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం నిరంతరం కృషి చేస్తున్న నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున యువత స్వచ్ఛందంగా రక్తదానంలో పాల్గొనాలని కార్యక్రమ నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మన పిల్లల భవిష్యత్తు కోసం దేశ విదేశాలు తిరిగి పెట్టుబడిదారులను ఆకర్షించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న నాయకుడికి కృతజ్ఞతగా ఈ రక్తదానం అంకితం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అనేకమంది ప్రాణాలను కాపాడే అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంచార్జీ రాఘవేంద్ర రెడ్డి సోదరులు రామకృష్ణ రెడ్డి తనయుడు రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల అధ్యక్షులు పల్లెపాడు రామిరెడ్డి, మూత్తురెడ్డి, బాసలదొడ్డి ఈరణ్ణ, అడివప్ప గౌడ్, వెంకటపతిరాజు, మాలపల్లి వెంకటేష్, అయ్యన్న, వక్రని వెంకటేష్, సతీష్ నాయుడు, సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే తోవి రామకృష్ణ, హరివిలి వీరేష్, విజయ్ కుమార్, ఏశోభు, నరసప్ప, మల్లికార్జున, గాలం వీరేష్, వీరారెడ్డి సహా నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :