Saturday, 18 April 2026 03:12:07 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్..

Date : 16 April 2026 06:29 PM Views : 86

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణానికి చెందిన బి. జాఫర్ తనకు ప్రాణహాని బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తూ కర్నూలు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ను ఆశ్రయించి పోలీసు రక్షణ కల్పించాలని వినతి పత్రం సమర్పించారు. తాను ఆదోని షాహీ జామియా మసీదు ఆస్తులపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలు, అనధికార వినియోగంపై గత ఒక నెలగా నిరంతరం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, సరైన పరిపాలన కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంగా ఎన్నికలు జరగకపోవడానికి కొందరు వ్యక్తులు అడ్డంకులు సృష్టించారని ఆరోపించిన జాఫర్, ఈ విషయంపై ఇటీవల సబ్-కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు రెండు సార్లు మీడియా సమావేశాల ద్వారా సమస్యను ప్రజల దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇటీవలి మూడు రోజులుగా తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్ ద్వారా చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని, దీంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తనకు తక్షణమే పోలీసు రక్షణ కల్పించి, బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :