Monday, 15 June 2026 01:47:42 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

*రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తానని 'గద్దెఎక్కిన' చంద్రబాబు 'రెడ్ బుక్' తో 'అరాచక' పాలనను సాగిస్తున్నారు.

Date : 02 February 2026 11:37 AM Views : 95

DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్రంలో అధికారపార్టీకి చెందిన టిడిపి గూండాలచే ... మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్ సీపీ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ అంబటి రాంబాబు గారిపై దాడి చేయించడమే కాదు, ఆయన పార్టీ కార్యాలయం, మరియు ఇంటిని ముట్టడించి, ఫర్నీచర్, విలువైన వస్తువులకు నిప్పంటించి తగలుపెట్టడం, నిర్మాణాలను ద్వంశం చేసి, కుటుంబీకులను భయభ్రాంతులకు గురి చేయడం అత్యంత దుర్మార్గం. ఇది టీడీపీ గూండాలు ఉద్ధేశం పూర్వకంగా ఆయనపైన చేసిన దాడి మరియు ఆయన కార్యాలయంలోని, ఇంటి లోని విలువైన వస్తువులను తగలు పెట్టడం, ఇంటి నిర్మాణాలను పగలు కొట్టడం అంటే ఇది ముమ్మాటికి ఒక ప్రణాళికతో టీడీపీ గూండాలతో ఆయన పై బాబు, లోకేష్ చేయించిన హత్యాయత్నంగానే భావించాలి. అంతేకాదు, సుపరిపాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను, సుపరిపాలను పక్కన పెట్టి.. మా పార్టీ అధ్యక్షులు మరియు మాజీ సీఎం గౌ. శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారిని, మా పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే మా నాయకులపై టీడీపీ గూండాలచే దౌర్జన్యాలు చేయించడం, జైళ్లకు పంపడం వంటి చర్యలతో.. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలన కాదు, అటవిక రాజ్యాన్ని నడుపుతున్నారు. చట్టం ప్రకారం రక్షణ కల్పించాల్సిన రాష్ట్ర పోలీస్ వ్యవస్థ చూస్తూ ప్రేక్షక పాత్ర వహించడం అత్యంత దురదృష్టకరం. మా జగనన్న పాలనలో.. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యితో తయరుచేసారని అబధ్దపు ప్రచారంతో ప్రజలను మోసం చేసిన చంద్ర బాబు.. మొదటి నుంచి ఆయన నోటి మాటలు, ఆయన ఇచ్చిన హామీలు అన్నీ కల్తీయే.. ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ తీసుకొని వస్తానని చెప్పి, ప్రత్యేక ప్యాకేజీ ని తెచ్చారు. రాజధాని అమరావతి ని ప్రపంచ రాజధానిలను మెప్పించేలా నిర్మిస్తానని చెప్పి వరదనీరు బురదనీటిలో నిర్మాణాలు నత్త నడక లో నడుస్తున్నాయి. రాష్ట్రంలోకి దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు ఊకదంపుడుగా వచ్చి పెట్టేటందుకు క్యూ లైన్ లో అనుమతులు పొందుతున్నారని మీ సొంత అద్దె మీడియాలతో చేసే ప్రచారం తప్ప.. రాష్ట్రంలో ఇప్పటి వరకు వచ్చిన పరిశ్రమలు ఎన్ని.. ఎంత మంది కి ఉపాధి కల్పించారనేది ప్రజలు గమనిస్తున్నారు. మీ రెడ్ బుక్ పాలనను ప్రజలు గమనిస్తున్నారు. అతి గర్వంతో ఒళ్ళు మరిచి మీ టిడిపి ప్రభుత్వం, మీ పార్టీ గూండాలు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేకత ఉప్పెనగా మారి తెలుగు దేశం పార్టీని సర్వ నాశనం చేస్తుంది. రాష్ట్రంలో 40 శాతం పైన ఫిక్స్డ్ ఓటు బ్యాంకు మా వెంటే ఉంది. ఎన్నికల ముందు ఏ రెండు వర్గాల జనాన్ని కొంత మభ్యపెట్టి చీల్చి గెలిచావో.. ఆ జనంకు మీరేమి చేశారో అనేది పూర్తిగా తెలుసుకున్నారు. మనసు మారింది. వారంతా ఎన్నికల ముందు మా వెంటే. ఎలాగూ మీరు రెండోసారి అధికారంలోకి రావడం అనేది ఎలాగూ లేదు. మిమ్మల్ని నమ్ముకుని అధికారంలోకి వచ్చిన జనసేనకు కూడా మీ బురద అంటించారు. జనసేన కూడా ప్రజల్లో పలుచబడింది. మా జగన్ అన్న అంటే ఏమిటో ప్రజలు అర్దం చేసుకున్నారు. కావున మీ రెడ్ బుక్ ప్రక్కన పెట్టి బుద్దిగా ఈ రెండు మూడు ఏళ్లలో అయినా ప్రజలకు మంచి పాలన ఇవ్వండి. అప్రజాస్వామ్యం గా అరెస్టు చేసిన మా నాయకుడు అంబటి రాంబాబు గారిని తక్షణమే విడుదల చేయండి. ఇట్లు మీ వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్)పలాస, ఇచ్చాపురం దుంపల రామారావు (లక్ష్మణ రావు).

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :