DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కర్నూలు పట్టణంలోని లేబర్ కాలనీ ప్రాంతంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ మొత్తాన్ని అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన అర్హుల వరకు చేరాలనే లక్ష్యంతో ఇంటి వద్దకే పెన్షన్ అందజేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇబ్బందులు కలగకుండా ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Admin
DNB News