DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మూడో శనివారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది తమ తమ పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల పరిసరాలను శుభ్రపరిచారు. చెత్తాచెదారాలను తొలగించడం, శుభ్రపరచడం, పిచ్చిమొక్కలను తొలగించడం వంటి చర్యలు చేపట్టారు. స్వచ్ఛతతో ఆరోగ్యం సాధ్యమని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పోలీసు అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.
Admin
DNB News