DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని నుంచి ఇస్వీ గ్రామానికి వెళ్లే మార్గంలో మాసా మసీదు వెనుక భాగంలో ఓ గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల వివరాల ప్రకారం మృతుడు సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండవచ్చని, ఎత్తు సుమారు 5 అడుగుల 6 అంగుళాలు ఉండొచ్చని తెలిపారు. మృతుడి శరీరంపై తెల్లటి బనియన్, తెల్లటి ప్యాంటు, నీలిరంగు జీన్స్ షర్టు ఉన్నట్లు వెల్లడించారు. మృతదేహాన్ని గుర్తింపు కోసం ప్రస్తుతం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి మార్చురీలో ఉంచినట్లు తెలిపారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు వెంటనే ఆదోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సీఐను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అలాగే మృతుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు లేదా బంధువులు ఎవరూ రాని పక్షంలో మూడవ రోజు దహన సంస్కారాలు నిర్వహించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Admin
DNB News