DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని ఎమ్మెల్యే పార్థసారధిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో బెదిరింపులు వెలువడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పెద్దకడుబూరు మండలం నౌనేకల్ గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్త చాకలి వీరేష్ ఈ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమాచారం ప్రకారం, చాకలి వీరేష్ మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. ఈ ఘటనపై బీజేపీ నాయకులు వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనపై స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Admin
DNB News