DNB News - ఆంధ్రప్రదేశ్ / : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయడం జరిగింది. ఆదోని నియోజకవర్గంలోని 5వ వార్డు పరిధిలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఏపీ కమ్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పోలినేని సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ అందజేసి, వారి సమస్యలను తెలుసుకున్నారు. పెన్షన్‌ను ముందుగానే అందించడం ద్వారా వృద్ధులు, వికలాంగులు మరియు ఇతర లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి లబ్ధిదారునికి సమయానికి పెన్షన్ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
Admin
DNB News