DNB News - ఆంధ్రప్రదేశ్ / : రెండేళ్లుగా తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం... అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ ... కాళ్లు అరిగేలా పొట్ట చేత పట్టుకొని తిరుగుతున్న స్విమ్స్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర చైర్మన్ బిఆర్ నాయుడు లు ముందుకు రావాలని తాము ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు డిమాండ్ చేశారు. మంగళవారం నాటి ఉదయం స్థానిక కపిల్ తీర్థం రోడ్ లోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట స్విమ్స్ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. గత రెండేళ్లుగా అధికారులు తమను శానిటేషన్ హోదా నుంచి తప్పించి వార్డు బాయ్ లుగా గుర్తించాలని చేస్తున్న పోరాటాన్ని పట్టించుకోకపోవడం దారుణమని సిహెచ్ నర్సింగరావు విమర్శించారు. గత ఓ ప్రస్తుత కలెక్టర్ ఎస్పీ ఆర్డిఓ స్విమ్స్ డైరెక్టర్ మరియు ఎనిమిది విభాగాల ఉన్నతాధికారులు తాము చేస్తున్న పోరాటాన్ని న్యాయమైనదని ప్రకటించి మూడు నెలలలో సమస్యను పరిష్కరిస్తామని, వేతనాలు పెంచుతామని, శానిటేషన్ హోదాను రద్దు చేస్తామని హామీని ఇచ్చారని సిహెచ్ నర్సింగరావు గుర్తు చేశారు. 10 నెలలు పూర్తవుతున్నా అమలు చేయకపోవడంతో అనివార్యమై గత 68 రోజులుగా ఎర్రటి ఎండలలో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారని అన్నారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి మాట్లాడుతూ నాలుగు రోజు ల్లో సమస్యను పరిష్కరిస్తామన్న ఇఓ సైతం తమ గోడును పట్టించుకోవడంలేదని, ఏడాది కిందట న్యాయమైన సమస్య రెండు రోజులలో పరిష�
Admin
DNB News