DNB News - ఆంధ్రప్రదేశ్ / : ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా సెయింట్ జోసెఫ్ కళాశాలలో “జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్” అంశంపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. సదస్సులో భాగంగా పొడి వ్యర్థాలు, తడి వ్యర్థాలు, పారిశుధ్య వ్యర్థాలు, ప్రత్యేక సంరక్షణ వ్యర్థాల విభజన గురించి విద్యార్థులకు వివరంగా అవగాహన కల్పించారు. వ్యర్థాలను మూల స్థాయిలోనే వేరు చేయడం ద్వారా పరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అధికారులు వివరించారు. కళాశాలలు, విద్యాసంస్థలు జీరో వేస్ట్ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. విద్యార్థులు తమ ఇళ్లలో, కళాశాలల్లో వ్యర్థాల వర్గీకరణను తప్పనిసరిగా అమలు చేయాలని, స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
DNB News