DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుడు, పార్టీ ఇన్‌చార్జ్ వై. సాయి ప్రసాద్ రెడ్డి ఫిబ్రవరి 5న నిర్వహించనున్న “ఛలో పోతిరెడ్డిపాడు” కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీమకు హక్కుగా రావాల్సిన కృష్ణాజలాల వాటాను సురక్షితంగా అందించే ఇన్సూరెన్స్ లాంటి ప్రాజెక్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను వెంటనే పూర్తిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ పథకం పూర్తి అయితే రాయలసీమ ప్రాంతానికి శాశ్వత నీటి భద్రత లభిస్తుందని తెలిపారు. రాయలసీమ ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ ద్రోహానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజలంతా ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. రాయలసీమకు న్యాయం జరిగే వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Admin
DNB News