DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంక దినకర్ పర్యటన సందర్భంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాలు మరియు ప్రాజెక్టుల అమలు స్థితిగతులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న ఇరవై పాయింట్ల కార్యక్రమం కింద చేపట్టిన పథకాల పురోగతిపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా పేదల సంక్షేమం, గృహ నిర్మాణం, ఉపాధి హామీ, విద్య, ఆరోగ్య రంగాల్లో జరుగుతున్న కార్యక్రమాల అమలు పై వివరాలు సేకరించారు. ఎమ్మెల్యే డా. పార్థసారథి మాట్లాడుతూ, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ స్థాయిలో పథకాల అమలులో ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొని తమ శాఖల పనితీరును వివరించారు.
Admin
DNB News