Monday, 15 June 2026 01:43:53 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో పాల్గొన్న యం.ఎల్.ఏ ముప్పిడి..

Date : 17 March 2026 03:38 PM Views : 57

DNB News - ఆంధ్రప్రదేశ్ / : తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు,పొట్టి శ్రీరాములు జయంతి సరదర్బంగా కొవ్వూరు లోని కోట్లవారి సెంటర్ లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .... తెలుగు జాతి ఉనికిని, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి 'ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష.. మన భాషాభిమానానికి, ప్రాణత్యాగానికి, అలుపెరగని ప్రజాస్వామిక పోరాటానికి నిలువెత్తు నిదర్శనమని. నాటి ఆ చారిత్రక త్యాగాన్ని, తెలుగువారి ఐక్యతను స్మరించుకోవడానికి ఆయన 125వ జయంతి మనకందరికీ ఒక గొప్ప సందర్భమన్నారు. ఆయన చేసిన 58 రోజుల నిరాహార దీక్ష వ్యక్తిగత గుర్తింపు కోసం కాదు, అధికార కోసం కాదు. అది తెలుగు ప్రజల భాష, గుర్తింపు, ఆత్మగౌరవం కోసం చేసిన అత్యున్నత త్యాగం. ఆయన మరణం దేశ మనసాక్షిని మేల్కొలిపింది. ఆ త్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి, భారతదేశ చరిత్రను ఒక కీలక మలుపు తిప్పింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న ప్రతి అభివృద్ధికి, ప్రగతికి, ప్రతి అవకాశానికి పునాది అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగమే. ఆయన త్యాగం వల్లే తెలుగు ప్రజలు గౌరవంగా, గర్వంగా జీవిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టీగా నిలిచింది. రాష్ట్ర గౌరవం కోసం త్యాగం చేసిన మహనీయులను ఎప్పటికీ గౌరవిస్తూ వస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ప్రతి ఇంటికి చేరేలా, ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలిచేలా చర్యలు తీసుకుంటున్నారు. అమరావతిలో నిర్మించిన ఒక సాధారణ విగ్రహం కాదు. అది తెలుగు ప్రజల తరపున అమరజీవికి అర్పించిన హృదయపూర్వక ఘన నివాళి.. త్యాగ దినోత్సవం జరుపుకోవడం అంటే కేవలం ఒక కార్యక్రమం కాదు. అది తెలుగు ప్రజలందరం కలిసి అమరజీవికి చెప్పే కృతజ్ఞత. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి, భవిష్యత్తులో మన రాష్ట్రాన్ని మరింత గొప్ప దిశగా నడిపించే స్ఫూర్తిగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలోద్విసభ్య కమిటీ మెంబర్ కంటమణి రామకృష్ణ , మద్దిపట్ల శివరామ కృష్ణ , చైర్ పర్సన్ భావన రత్నకుమారి, యం.ఆర్.ఓ, యం. డి. ఓ, సూరపని చిన్ని, దాయన రామకృష్ణ, వేమగిరి వెంకట్రావ్ , మరపట్ల కళాధర్ చక్రవర్తి, నాళం శ్రీనివాస్ ,బేతిన నారాయణ ,కుప్పాల ప్రసాద్ ,పెనుమాక జయరాజు , సుంకర సత్తిబాబు ,బర్ల శ్రీను, వరిగేటి కాంతరాజు ,బొబ్బిలి పేర్రాజు, తదితర కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :