DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని రూరల్ సర్కిల్ CI సి. నల్లప్ప , ఇస్వి SI మహేష్ కుమార్ మరియు పోలీసు సిబ్బంది సంయుక్తంగా ఆదోని రూరల్ సర్కిల్ పరిధిలోని ఇస్వి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కొండ ప్రాంతాలలో డ్రోన్ సహాయంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా నాటుసారా తయారీ జరుగుతున్న స్థావరాలను గుర్తించి దాడులు నిర్వహించగా, సుమారు 1000 లీటర్ల ఊటను ధ్వంసం చేసి, 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆదోని టౌన్ బోయగేరి ప్రాంతానికి చెందిన ఉదయ్ పై కేసు నమోదు చేయబడింది. ఈ సందర్భంగా CI సి. నల్లప్ప మాట్లాడుతూ, ఆదోని సబ్ డివిజన్‌కు కేటాయించిన డ్రోన్ సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగిస్తూ రాబోయే రోజుల్లో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అణచివేస్తామని తెలిపారు. చట్టవిరుద్ధంగా నాటుసారా తయారీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాటుసారా తయారీదారులు వెంటనే ఈ అక్రమ కార్యకలాపాలను మానుకుని, ఇతర చట్టబద్ధమైన ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలని సూచించారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో మరింత కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. – సి. నల్లప్ప CI, ఆదోని రూరల్ సర్కిల్
Admin
DNB News