DNB News - ఆంధ్రప్రదేశ్ / : కలెక్టరేట్ నుండి "నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత" కార్యక్రమ నిర్వహణపై సంబంధిత శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సాగునీటి వినియోగంలో సమర్థత పెంపు, నీటి వనరుల సంరక్షణ, పంటలకు సమయానుకూలంగా నీటి సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. సాగునీటి సంఘాలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ రైతులతో సమన్వయం కలిగి పనిచేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల పరిధిలో నీటి పంపిణీ సక్రమంగా జరుగుతున్నదీ, ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి వినియోగంలో మితవ్యయం పాటించాలని, ప్రతి చుక్క నీటిని ఆదా చేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈ సమీక్షలో సంబంధిత శాఖల అధికారులు, ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
DNB News