Monday, 15 June 2026 01:59:59 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

స్మార్ట్ సిటీ లక్ష్యంగా రూ.1.17 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి టీ.జీ. భరత్ శంకుస్థాపన..

Date : 29 May 2026 11:00 AM Views : 29

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీ.జీ. భరత్ గుప్తా తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి వివిధ వార్డుల్లో రూ.1.17 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 22, 23, 24, 25వ వార్డుల్లో రూ.35.40 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, హెచ్‌డీపీఈ పైప్‌లైన్లు, కమ్యూనిటీ టాయిలెట్ల మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 42, 43, 45, 46వ వార్డుల్లో రూ.65.25 లక్షలతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, పార్కు అభివృద్ధి, పైప్‌లైన్ నిర్మాణ పనులు ప్రారంభించారు. 47, 48, 50, 52వ వార్డుల్లో రూ.16.99 లక్షలతో కమ్యూనిటీ టాయిలెట్ల మరమ్మతులు, డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నగరంలోని ఆరు పార్కులను అన్ని హంగులతో అభివృద్ధి చేస్తున్నామని, ప్రతి పార్కులో వాకింగ్ ట్రాక్‌లు, గ్రీనరీతో పాటు ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో త్వరలోనే భారీ స్థాయిలో డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. గత రెండు రోజుల్లో దాదాపు రూ.3 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామని, నెల రోజుల్లోపు అన్ని పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :