DNB News - ఆంధ్రప్రదేశ్ / : మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను సాధించేందుకు అందరూ కృషి చేయాలని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి పిలుపునిచ్చారు. శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఆదోనిలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11న నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలో జన్మించిన పూలే, సంఘ సంస్కర్తగా మహిళా విద్య, కుల నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని అన్నారు. దళితులు, అణగారిన వర్గాల హక్కుల కోసం కృషి చేసిన ఆయన సేవలు అపూర్వమని కొనియాడారు. సమాజంలో సమానత్వం నెలకొల్పడానికి పూలే ఆశయాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు నివాళులు అర్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Admin
DNB News