Monday, 15 June 2026 01:44:57 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

మాదకద్రవ్యాలపై జిల్లా పోలీసుల మెగా కార్డన్ సెర్చ్ – 52 వాహనాలు స్వాధీనం, 41 లిక్కర్ బాటిళ్లు సీజ్..

Date : 28 March 2026 05:00 PM Views : 94

DNB News - ఆంధ్రప్రదేశ్ / : మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా కర్నూలు జిల్లా పోలీసు శాఖ శనివారం జిల్లా వ్యాప్తంగా “మెగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ డే” ను విస్తృతంగా నిర్వహించింది. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఈగల్ ఐజీ ఏకే రవి కృష్ణ, ఐపీఎస్ పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పోలీసు సబ్ డివిజన్‌ల పరిధిలో ఈ తనిఖీలు చేపట్టారు. పత్తికొండ సబ్ డివిజన్‌లో హోళగుంద పట్టణం, ఎమ్మిగనూరు సబ్ డివిజన్‌లో మంత్రాలయం పట్టణం, ఆదోని సబ్ డివిజన్‌లో ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న పెండేకల్ గ్రామం, కర్నూలు సబ్ డివిజన్‌లో నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలలో విస్తృత కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా మరియు సంబంధిత నేరాలను అరికట్టడమే ఈ ప్రత్యేక తనిఖీల ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది కలిపి మొత్తం 196 మంది పాల్గొన్నారు. తనిఖీలలో భాగంగా మొత్తం 350 మంది వ్యక్తులను తనిఖీ చేయగా, 50 అనుమానితుల ఇళ్లను తనిఖీ చేశారు. అలాగే 77 వాహనాలను తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని 52 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మంత్రాలయం పోలీస్ స్టేషన్ పరిధిలో 41 లిక్కర్ బాటిళ్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక మరియు చట్టపరమైన దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడంతో పాటు కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఏపీ EAGLE టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని అధికారులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన దిశగా ఇలాంటి దాడులు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ డిఎస్పీ వెంకట్రామయ్య, ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి, కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ ఉపేంద్రబాబు, సిఐలు, ఎస్సైలు, ఈగల్ టీం మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు..

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :