DNB News - ఆంధ్రప్రదేశ్ / : వైసీపీ నాయకులు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలను అసెంబ్లీలో ప్రదర్శిస్తూ అపవిత్రం చేశారని ఆరోపిస్తూ, ఈ రోజు ఉదయం కర్నూలు నగరంలోని 49వ వార్డు ఎన్ఆర్‌పేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుదీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్, కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రం సింఘ్, హజ్ కమిటీ సభ్యుడు మన్సూర్ అలి ఖాన్, పార్లమెంట్ పార్టీ ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్, రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షుడు సోమిశెట్టి నవీన్, రాష్ట్ర తెలుగుయువత అధికార ప్రతినిధి జూటూరు రవి కుమార్, కర్నూలు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మారుతి శర్మ, పి. హనుమంతరావు చౌదరి, గట్టు తిలక్, పాల్ రాజ్, రవి చంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, దేవతా చిత్రాలను రాజకీయ వేదికలపై ఉపయోగించడం సరికాదని, భక్తుల మనోభావాలను దెబ్బతీయడం తగదని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
DNB News