DNB News - ఆంధ్రప్రదేశ్ / : ముస్లిం మైనారిటీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఆల్ మైనారిటీ వెల్ఫేర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పండుగను సంతోషంగా జరుపుకోలేని స్థితిలో ఉన్న సుమారు 200 మంది పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను అందజేసినట్లు తెలిపారు. ప్రతి లబ్ధిదారునికి ₹600 విలువైన నిత్యావసర సరుకులు (బియ్యం, కిరాణా)తో పాటు పాలు, స్వీట్లు వంటి పండుగ అవసరాల కోసం ₹400 నగదును కలిపి మొత్తం ₹1000 విలువైన తోఫాను అందించామని పేర్కొన్నారు. పేదలను ఆదుకోవడం ఒక పుణ్య కార్యక్రమమని, ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలను కలెక్టర్ అభినందించారు. అల్ మేవా సంస్థ సేవలను కూడా ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ సబిహ పర్వీన్, జిల్లా ముస్లిం మైనారిటీ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ ముక్తియార్ బాషా, జనరల్ సెక్రటరీ రియాజ్ బాషా, వైస్ ప్రెసిడెంట్ జాకిర్ హుస్సేన్, ఫైనాన్స్ సెక్రటరీ షఫీ అహ్మద్, ఉమెన్ సెక్రటరీ సహారా భాను, స్టేట్ కౌన్సిల్ మెంబర్ జమిల్ ఉద్దీన్, జిల్లా కౌన్సిల్ సభ్యులు సఫియుల్లా బైగ్, అబ్దుల్ కాలిక్, ఇంతియాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News