DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, కళాబంధువు టీజీ వెంకటేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని మౌర్య ఇన్‌లో గల ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారులు టీజీ వెంకటేష్‌కు శాలువ కప్పి, పూలమాలలు వేసి, మిఠాయిలు తినిపిస్తూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రంగస్థల కళాకారులకు ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. కళాకారులు ఐక్యంగా పనిచేసి రంగస్థల పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కళారంగంలో నిరంతరం సేవలందిస్తున్న ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించి ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక ఉపాధ్యక్షులు పి. హనుమంతరావు చౌదరి, సమన్వయకర్త డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా, తమ్మినేని నరసయ్య చౌదరి, సినీ గాయకులు సి. రమేష్ బాబు, మోహన్ రెడ్డి, మల్లికార్జున, సుభాన్ భాష తదితరులు పాల్గొని టీజీ వెంకటేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా సమన్వయకర్త, కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక.
Admin
DNB News