DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మండలం సదాపురం గ్రామంలో సర్వే నంబర్ 352కు సంబంధించిన భూమిపై భారీ మోసం జరిగిందని బాధితులు ఆరోపించారు. లేఅవుట్ అనుమతి లేకుండానే ప్లాట్లు విక్రయించి, ఒకే భూమిని పలుమార్లు రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా మోసం చేసినట్లు తెలిపారు. ప్లాట్లు కొనుగోలు చేసినప్పటికీ భూమి చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మను కలిసి వినతి పత్రం సమర్పించగా, ఆమె న్యాయం జరిగే వరకు పోరాడతానని హామీ ఇచ్చారు. ఘటనపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Admin
DNB News