Wednesday, 17 June 2026 02:14:12 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఎస్సీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – ప్రజా వినతులకు స్పందించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు మేకల బిక్షం..

Date : 28 March 2026 04:55 PM Views : 51

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎస్సీల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు మేకల బిక్షం పేర్కొన్నారు. శనివారం కర్నూలు పర్యటనలో భాగంగా స్థానిక రాష్ట్ర అతిథి గృహానికి విచ్చేసిన ఆయనకు అధికారులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ప్రజల నుండి వినతులను స్వీకరించిన మేకల బిక్షం, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు సంబంధించిన భూసంబంధిత సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, విద్య మరియు ఉపాధి అంశాలపై వినతులు సమర్పించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న ఆయన, వాటిని సానుకూలంగా పరిశీలించి వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రాబోయే పది రోజులలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని శాఖలపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సీల సంక్షేమానికి సంబంధించిన పథకాల అమలు స్థితి, సమస్యలు, సమస్యల పరిష్కార మార్గాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు వెల్లడించారు. ఎస్సీ వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం మరియు కమిషన్ సమన్వయంతో పని చేస్తున్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి మద్దిలేటి, తహసీల్దార్ ఆంజనేయులు, వివిధ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :