DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మిగనూరు నియోజకవర్గం కలుగొట్లలో నిర్వహించిన మీ భూమి – మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపీఎస్, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమ ప్రాంతం, హెలిప్యాడ్ పరిసరాలు, రాకపోకల మార్గాల్లో భద్రతా చర్యలను పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తగిన భద్రతా ప్రమాణాలు కట్టుదిట్టంగా అమలు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని డిఐజి, ఎస్పీలు ఆదేశించారు. కలుగొట్ల హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రిని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
Admin
DNB News