DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక మద్దూర్ నగర్‌లోని అమ్మ వృద్ధుల శరణాలయంలో పింఛనుదారులకు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి స్వయంగా పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి వారికి పెన్షన్ మొత్తాన్ని అందజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధులు ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
DNB News