DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఉర్దూ అకాడమీ చైర్మన్ మరియు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఫారుఖ్ షుబ్లీ ఆదేశాల మేరకు, సంస్థ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ఆధ్వర్యంలో టిడిపి పొలిటికల్ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్సీ టిడి జనార్దన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదోని పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే జీవన జ్యోతి అనాథ ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమం నిర్వహించారు. టిడి జనార్దన్ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు షకీల్, సద్దాం హుసేన్, రెహమానియా మసీదు కమిటీ సభ్యులు అబ్దుల్ సుభాన్, ఇమ్రాన్, ఇలియాస్, తన్వీర్, మెహబూబ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News