DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా దొంగిలించిన మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం ఆదోని పట్టణంలోని లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా బైక్‌పై వస్తున్న కర్నూలు జిల్లా హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31)ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితుడు గతంలో ఆదోని వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్, ఆదోని తాలూకా, పత్తికొండ తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఆదోని – ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలోని రహస్య ప్రదేశంలో దాచిన రూ.10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బందిని సి.ఐ రాజశేఖర్ రెడ్డి అభినందించారు.
Admin
DNB News