Wednesday, 17 June 2026 01:33:25 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు – శాఖల సమన్వయంతో ముందుకు నగరపాలక సంస్థ...

Date : 01 May 2026 11:50 AM Views : 33

DNB News - ఆంధ్రప్రదేశ్ / : నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. గురువారం స్థానిక వెంకటరమణ కాలనీలోని నగరపాలక కార్యాలయంలో నగరపాలక సంస్థ, ట్రాఫిక్ పోలీస్, ఏపీఎస్‌ ఆర్టీసీ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజల సౌకర్యార్థం ముఖ్య ప్రాంతాల్లో కొత్త బస్‌స్టాప్‌ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగిస్తున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ సక్రమమైన బస్‌స్టాప్ సౌకర్యాలు కల్పించేందుకు రవాణా శాఖ అధికారులు సహకరించాలని కోరారు. అలాగే రెడ్ జోన్‌లలో వీధి వ్యాపారుల నియంత్రణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామని పేర్కొన్నారు. రహదారులపై అక్రమ వ్యాపారాలు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నాయని, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రెడ్ జోన్‌లలో కఠిన చర్యలు తీసుకుని ట్రాఫిక్ సౌలభ్యాన్ని మెరుగుపరచాలని, పట్టణ ప్రణాళిక, మెప్మా అధికారులకు ట్రాఫిక్ పోలీసులు పూర్తి సహకారం అందించాలని సూచించారు. పోలీసు, ఆర్టీసీ శాఖలు నగరపాలక సంస్థతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని కమిషనర్ కోరారు. ప్రజల సౌకర్యం, నగర సౌందర్యం, రోడ్డు భద్రత కోసం అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఈ రమణమూర్తి, ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీనివాసులు, ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ హరి, ఇంచార్జి సిటీ ప్లానర్ వై. వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: