Wednesday, 17 June 2026 02:47:16 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

పదవ తరగతి పరీక్షలకు కర్నూలు జిల్లాలో పటిష్ట బందోబస్తు – పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్..

Date : 15 March 2026 11:30 AM Views : 50

DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లాలో ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ తరపున కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షా పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా పేపర్లు కేంద్రాలకు తీసుకువెళ్లేటప్పుడు, సమాధాన పత్రాలు తరలించే సమయంలో కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండడంతో కేంద్రాల ఆవరణలో ఇన్విజిలేటర్లు మరియు పరీక్షలకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతరులు ఎవరూ ఉండరాదని స్పష్టం చేశారు. అలాగే పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన మేరకు బందోబస్తు ఏర్పాటు చేసి, ఎటువంటి అవకతవకలు లేదా మాల్ ప్రాక్టీస్ జరగకుండా పోలీసు అధికారులు పకడ్బందీగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని, తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గమనించి వారికి సహకరించాలని సూచించారు. మాస్ కాపీయింగ్ లేదా మాల్ ప్రాక్టీస్‌కు ఎవరైనా పాల్పడినా, వారికి సహకరించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని ఏ పరీక్షా కేంద్రం వద్ద అయినా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే డయల్ 112 / 100కు సమాచారం అందించాలని జిల్లా ప్రజలను ఎస్పీ కోరారు. జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: