DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మిగనూరు పట్టణంలోని ఎం.జి పెట్రోల్ బంక్ వెనుక ఉన్న తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకులు కె. చెన్నకేశవరెడ్డి గారిని మాజీ పార్లమెంట్ సభ్యురాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక మరియు ఆమె భర్త, బుట్టా ఫౌండేషన్ అధినేత శ్రీ బుట్టా శివ నీలకంఠ మర్యాదపూర్వకంగా పరామర్శించారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో శస్త్రచికిత్స చేయించుకున్న శ్రీ కె. చెన్నకేశవరెడ్డి గారు ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీమతి బుట్టా రేణుక , బుట్టా శివ నీలకంఠ ప్రత్యేకంగా ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజల మధ్య చురుకుగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ కె. రాజీవ్ రెడ్డి , ఎమ్మిగనూరు మండల కన్వీనర్ బి.ఆర్. బసిరెడ్డి పాల్గొన్నారు.
Admin
DNB News