Wednesday, 17 June 2026 03:00:35 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

గంగపుత్ర పేరుతో అక్రమాలు.. మత్స్యకార కుటుంబానికి బెదిరింపులు..

Date : 15 May 2026 11:50 AM Views : 95

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా ఆదోనిలోని ఒక చెరువులో గత 40 సంవత్సరాలుగా మత్స్యకార కుటుంబానికి చెందిన నారాయణ కుటుంబం చేపల వేట చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ కారణాల వల్ల అనంతరం ఇతర కులాలకు చెందిన వారు కూడా అదే చెరువులో చేపల వేట చేపట్టారని పేర్కొన్నారు. నారాయణ కుటుంబంతో పాటు ఇతరులు కూడా చేపల వేట సాగిస్తున్న సమయంలో తమను గంగపుత్ర సంఘం నాయకులమని చెప్పుకునే కోదండ, ఆయన కుమారుడు రమేష్, ప్రకాష్, దీపక్, శ్రీనివాసులు వ్యవహారంలో జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. తమ వంతుగా లక్ష రూపాయలు సీడ్ కోసం చెల్లించి చేపల వేట సాగిస్తున్నప్పటికీ, గంగపుత్ర సంఘం పేరుతో వాటాలు తీసుకున్నారని నారాయణ తెలిపారు. ఆ డబ్బులను గంగాభవాని దేవాలయానికి ఇస్తామని చెప్పినా, దేవాలయ నిర్వాహకులు తమకు ఎలాంటి నగదు అందలేదని స్పష్టం చేశారని అన్నారు. అనంతరం ప్రైవేట్‌గా గంగమ్మ దేవరకు ఇచ్చామని మాట మార్చారని ఆరోపించారు. చివరికి 40 సంవత్సరాలుగా చేపల వేట వృత్తితో జీవిస్తున్న తన కుటుంబాన్ని చేపలు పట్టకుండా బెదిరిస్తున్నారని నారాయణ వాపోయారు. రమేష్ అనే వ్యక్తి తమ కుటుంబాన్ని దూషించి బెదిరించాడని ఆరోపించారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని, బెదిరింపులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని నారాయణ కూటమి నాయకులను కోరారు. ఈ సమావేశంలో మల్లికార్జున, రాజేష్, చిదానంద, లక్ష్మన్న, సురేందర్, వీరేష్ తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :