DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం టిడిపి ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదోని నియోజకవర్గానికి చెందిన 30 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.12,63,680 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఉమాపతి నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 18 నెలల్లో ఆదోని నియోజకవర్గంలో మొత్తం 519 మంది లబ్ధిదారులకు సుమారు రూ.1,85,63,758 విలువైన సహాయం సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించబడిందని తెలిపారు. ఇంకా 267 మంది లబ్ధిదారులకు చెక్కులు రావాల్సి ఉన్నాయని, అర్హులైన మరిన్ని పేద ప్రజలకు సహాయం అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఆర్థికంగా బలహీన వర్గాలు ఆసుపత్రి చికిత్స ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోందని, పేదల ప్రాణాలను కాపాడే ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమంగా ప్రభుత్వం దీనిని అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Admin
DNB News