Monday, 15 June 2026 02:26:17 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

అక్రమ అడ్మిషన్లతో విద్యా దోపిడీ – చర్యలు తీసుకోండి: AISF ఫైర్..

Date : 07 May 2026 10:27 AM Views : 41

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహించి విద్యార్థులు, తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏఐఎస్ఎఫ్ తాలూకా సమితి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్. షాబీర్ భాష, జిల్లా సహాయ కార్యదర్శి థామస్, జిల్లా ఉపాధ్యక్షుడు ఈరేష్ మాట్లాడుతూ— ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1ను పూర్తిగా విస్మరించి ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్ బోర్డులు ఏర్పాటు చేసి తప్పుడు ప్రచారాలతో విద్యార్థులను ఆకర్షిస్తున్నాయని ఆరోపించారు. ముందస్తు అడ్మిషన్ల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చేస్తున్నారని, కొంతమంది గుర్తింపు లేని విద్యాసంస్థలు కూడా అడ్మిషన్లు చేపట్టి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయని తెలిపారు. విద్యార్థుల ఇళ్లకు పీఆర్‌వోలు పంపించి ఒత్తిడి తీసుకువస్తూ అడ్మిషన్లు నమోదు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వారి పర్యవేక్షణ లోపమే ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలకు కారణమని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, గుర్తింపు లేకుండా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థలను సీజ్ చేసి, అక్రమ ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల ఎదుట ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కోశాధికారి వీరేష్, నాయకులు శివ, ఆకాష్, నర్సప్ప, రాజు, నవీన్, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :