DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లాలో కుష్టు వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “స్పర్శ” కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమానికి సంబంధించి రూపొందించిన కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కుష్టు వ్యాధి పూర్తిగా నయం అయ్యే వ్యాధి అని, ప్రారంభ దశలో గుర్తిస్తే సమర్థవంతమైన చికిత్స ద్వారా పూర్తి ఆరోగ్యం సాధ్యమవుతుందని తెలిపారు. కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా, వారిని సమాజంలో గౌరవంగా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా ఉచిత వైద్య సేవలు, మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. “స్పర్శ” కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామం, పట్టణంలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి కుష్టు వ్యాధి నిర్మూలనకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
Admin
DNB News