Monday, 15 June 2026 01:58:49 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

కూటమి పెద్దల వైఫల్యంతో ఆదోనిలో ఫ్యాక్షన్ వాతావరణం : ముగ్ధూం భాష హెచ్చరిక..

Date : 12 May 2026 04:32 PM Views : 65

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కుప్పగల్‌ లో ఇటీవల బీజేపీ నాయకులు, టీడీపీ కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో గాయపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తను మదిరే సొసైటీ డైరెక్టర్ ముగ్ధూం భాష పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కూటమి నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో వరుసగా జరుగుతున్న ఘర్షణలు చూస్తుంటే కూటమి నాయకత్వంలో సమన్వయం పూర్తిగా లోపించిందని విమర్శించారు. “పెద్దలు ఒక్కటిగా ఉంటేనే కార్యకర్తలు సఖ్యతగా ఉంటారు. కానీ ఆదోని నియోజకవర్గంలో మూడు పార్టీల నాయకులు మూడు విధాలుగా వ్యవహరిస్తున్నారు. అసలు కూటమి పాలన ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోంది” అని వ్యాఖ్యానించారు. కూటమిలో ఎవరికి నష్టం జరిగినా చివరికి బాధపడేది కార్యకర్తలేనని అన్నారు. ఇటీవల జరిగిన ఘటనలో గాయపడిన వారిని ఎమ్మెల్యే పార్థసారథి, సీనియర్ టీడీపీ నాయకుడు ఉమాపతి నాయుడు పరామర్శించి శాంతి, సఖ్యత పాటించాలని సూచించారని, అదే సందేశాన్ని కూటమి పెద్దలే ముందుగా ఆచరణలో చూపించాలని ప్రశ్నించారు. గ్రామాల్లో ఘర్షణలు కొనసాగితే భవిష్యత్తులో ఆదోనిలో ఫ్యాక్షన్ వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉందని ఒక సీనియర్ జర్నలిస్టుగా తన అనుభవంతో చెబుతున్నానని ముగ్ధూం భాష తెలిపారు. టీడీపీకి గ్రామస్థాయిలో బలమైన క్యాడర్ ఉందని, ఇటీవల వైసీపీ నుంచి బీజేపీలో చేరిన వారిని నియంత్రించే బాధ్యత కూటమి నాయకులపై ఉందన్నారు. ఎమ్మెల్యే పార్థసారథి సమన్వయ పాత్ర పోషించాలని సూచించిన ఆయన, రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూటమి బలోపేతానికి కృషి చేస్తుంటే ఆదోనిలో మాత్రం విభజించి పాలించే పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. నియోజకవర్గంలోని అధికారులు కూడా రాజకీయ సమన్వయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరు బదిలీలు కోరుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. కబ్జాలపై మాత్రమే దృష్టి పెట్టకుండా కార్యకర్తల సమస్యలపై కూడా దృష్టి సారించాలని కోరారు. కర్నూలు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదోని నియోజకవర్గ పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసిన ముగ్ధూం భాష, “ప్రశాంతమైన ఆదోనికి ఫ్యాక్షన్ ముద్ర పడకముందే కూటమి పెద్దలు అందరూ ఒక తాటిపైకి రావాలి” అని ఆవేదన వ్యక్తం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :