Wednesday, 17 June 2026 03:06:53 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

పరాకాష్టకు చంద్రబాబు దుర్మార్గ పాలన

Date : 02 February 2026 06:05 PM Views : 142

DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గపు పాలన పరాకాష్టకు చేరిందని వైసీపీ విజయనగరం జిల్లా అధికార ప్రతినిధి, ఎంపీపీ యూ.సురేష్ ముఖర్జీ, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరణం సుదర్శన్ రావు మండిపడ్డారు. సోమవారం వంగర మండల కేంద్రంలో పత్రికా ముఖంగా మాట్లాడుతూ ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గుండాలు హత్యాయత్నం చేయడాన్ని వీరు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలకు తావు ఇవ్వకూడదన్నారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందువుల విశ్వాసాలను మంటగలుపుతున్నారని మండిపడ్డారు. పవిత్రమైన తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని సీఎం హోదాలో చంద్రబాబే దుష్ప్రచారం చేశారన్నారు. తాజాగా సీబీఐ సిట్‌ నివేదికలో జంతువుల కొవ్వు లేదని వెల్లడైందన్నారు. నిజాలు బయటకు రావడంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, కూటమి నాయకులు ఫ్రస్టేషన్‌లోకి వెళ్లిపోయారని తెలిపారు. పైగా వాస్తవాలను పక్కదోవ పట్టిస్తూ ఫ్లెక్సీలు వేసి మరోసారి అసత్య ప్రచారాలకు దిగారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కించపరిచేలా పోస్టర్లు వేయించారని మండిపడ్డారు. ఫ్లెక్సీలను తొలగించడానికి వెళితే పోలీసుల ముందే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు హత్యాయత్నం చేశారని తెలిపారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని,పోలీస్‌ వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు.ఇటీవల హిందూపురంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంపై కూడా టీడీపీ గూండాలు దాడి చేశారని, మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని, బీసీ నేత జోగి రమేష్ పై కూడా దాడికి పాల్పడ్డారని గుర్తు చేశారు. తిరుమల లడ్డూ విషయంలో ఫిర్యాదు చేయడాని వెళితే మాజీ హోంమంత్రి సుచరితను కూడా పోలీస్‌ కార్యాలయంలోకి అనుమతించలేదని చెప్పారు. రాష్ట్ర డీజీపీ బంట్రోతుగా మారిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై తక్షణం కేంద్రం స్పందించాలని, గవర్నర్‌ జోక్యం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్తామని.. దౌర్జన్యాలకు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. కూటమి కార్యకర్తలను చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు కంట్రోల్‌లో పెట్టుకోవాలని సూచించారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీచర్స్ వింగ్ అధ్యక్షులు మరిసర్ల గంగారావు, వంగర మండల యూత్ వింగ్ అధ్యక్షులు బొక్కెల వెంకటప్పలనాయుడు, మడ్డువలస సర్పంచ్ ప్రతినిధి బురాడ వెంకట రావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: