DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ మండలాలు, గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి వినతిని శ్రద్ధగా విన్న కలెక్టర్ డా.ఏ.సిరి, సంబంధిత శాఖల అధికారులకు తక్షణమే పరిశీలించి పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొని, ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు న్యాయం చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని అధికారులు తెలిపారు.
Admin
DNB News