DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి పి. విజయ తెలిపారు. ఎమ్మిగనూరులో బాల్య వివాహాలను అరికట్టేందుకు అవగాహన కార్యక్రమాలు, పర్యవేక్షణ చర్యలు మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. 18 ఏళ్లలోపు బాలికలు, 21 ఏళ్లలోపు బాలురు వివాహం చేసుకోవడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్ తీవ్రంగా దెబ్బతింటుందని అన్నారు. గ్రామ స్థాయిలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, పోలీసు శాఖ సమన్వయంతో ముందస్తు సమాచారం సేకరించి బాల్య వివాహాలను అడ్డుకుంటున్నామని తెలిపారు. ప్రజలు కూడా ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించి, బాల్య వివాహాల సమాచారం తెలిసిన వెంటనే మహిళా శిశు సంక్షేమ శాఖకు లేదా చైల్డ్‌లైన్ 1098కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Admin
DNB News