Monday, 15 June 2026 02:00:58 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

నాలుగు లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా ఆదోనిలో కార్మిక సంఘాల నిరసన..

Date : 01 April 2026 01:41 PM Views : 75

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేయనున్న నాలుగు లేబర్ కోడ్లను నిరసిస్తూ ఆదోని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా AITUC జిల్లా అధ్యక్షులు ఎన్. కృష్ణయ్య మాట్లాడుతూ, కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ నవంబర్ 21వ తేదీ నుంచి నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయాలని ప్రకటించడం కార్మిక హక్కులకు విఘాతం కలిగించే చర్య అని విమర్శించారు. బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ కోడ్స్ ద్వారా తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్, వృత్తి భద్రత కోడ్ పేరుతో వచ్చిన ఈ చట్టాలు కార్మికులకు మేలు చేస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాస్తవానికి ఇవి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. కార్మికుల శ్రమను దోచుకునేందుకు ఈ చట్టాలు ఉపయోగపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూడా ఎనిమిది గంటల పనిని 10 గంటలకు పెంచే నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని, ఇది కూడా లేబర్ కోడ్స్‌లో భాగమేనని విమర్శించారు. సమ్మె హక్కు, ఈఎస్ఐ, పిఎఫ్ వంటి రక్షణ చట్టాలు బలహీనపడే ప్రమాదం ఉందని అన్నారు. కార్మిక, రైతు, ప్రజా సంఘాలు ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో కార్మిక హక్కుల రక్షణ కోసం ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో AITUC పట్టణ అధ్యక్షులు ఓబి నాగరాజ్, కార్యదర్శి వైటి భీమేష్, కె. అజయ్ బాబు, సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు సుదర్శన్, ఉపాధ్యక్షులు గిరి మల్లప్ప, ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు కల్లుబావిరాజు, వడ్డే రాముడు, లక్ష్మీనారాయణ, దేవా నాగరాజు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :