DNB News - ఆంధ్రప్రదేశ్ / : డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (డి.ఎస్.ఎఫ్) ఆధ్వర్యంలో స్థానిక బీమాస్ సర్కిల్ నందు నూతన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలనే డిమాండ్‌తో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, నేడు మాట తప్పి నిరుద్యోగ యువతను మోసం చేస్తోందని ఆరోపించారు. అలాగే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా యువతకు తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా “కదలి రండి” అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ, తక్షణమే నూతన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని DSF విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో DSF నాయకులు నవీన్, రాజేష్, వినోద్, నవీన్, సుకుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News